మాస్కు ధరించిన ప్రధాని మోదీ

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కేంద్రం, రాష్ర్టాలు హెచ్చరిస్తున్న విషయం విదితమే. విధిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆయా ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్ర్టాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాస్కు ధరించారు. దాదాపు ముఖ్యమంత్రులందరూ కూడా మాస్కులు ధరించి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. 


కరోనా నివారణ చర్యలు, రాష్ర్టాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రులతో మోదీ సమీక్షిస్తున్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించే విషయంపై మోదీ కీలకంగా చర్చిస్తున్నారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకుంటున్నారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇప్పటికే పలు రాష్ర్టాలు ప్రధాని మోదీని కోరాయి. ముఖ్యమంత్రులతో సమీక్ష అనంతరం లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారు.