రబ్రీని జైలుకు పంపిస్తా: ఐశ్వర్యా రాయ్ తండ్రి హెచ్చరిక!

రబ్రీని జైలుకు పంపిస్తా: ఐశ్వర్యా రాయ్ తండ్రి హెచ్చరిక!


పట్నా: బీహార్ ఆర్జేడీ చీఫ్ లాలూ ఇంటి గుట్టు మరోమారు రోడ్డున పడింది. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యరాయ్‌ను ఆమె అత్త రబ్రీదేవి ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఐశ్వర్య తండ్రి చంద్రికారాయ్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లాలూ కుటుంబాన్ని రోడ్డున పడేస్తానని, రబ్రీదేవిని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. గతంలోనూ రబ్రీదేవి ఇలానే ప్రవర్తించారని, ఆమె తన కోడలిపైనే ప్రతాపం చూపుతుంటే, ఇక మిగిలిన మహిళల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యులంతా కలసి తన కుమార్తె జీవితాన్ని చిందరవందర చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య తల్లి పూర్ణిమా రాయ్ మాట్లాడుతూ లాలూ కుటుంబ సభ్యులంతా వికృత మనస్తత్వం కలిగినవారని, తన కుమార్తెకు భోజనం కూడా పెట్టేవారు కాదని ఆరోపించారు.